calender_icon.png 8 August, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిల్పూర్ లో అంగరంగ వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు

08-08-2025 05:35:11 PM

స్టేషన్ ఘన్పూర్ (విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని శ్రీ స్వామివారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. సామూహిక వరలక్ష్మీ వ్రతంలో మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వివిధ గ్రామాల, పట్టణాల భక్తులు తండోపతండాలుగా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వరలక్ష్మి వ్రతాన్ని వీక్షించారు. దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ధర్మకర్తలు గణగోని రమేశ్, గోలి రాశేఖర్, వేముల వెంకటేశ్వర్లు ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న, అర్చకులు  రవీందర్ శర్మ, రంగాచార్యులు,  కృష్ణమాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.