25-05-2025 06:43:17 PM
రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మర్తినేని ధర్మారావు..
హనుమకొండ (విజయక్రాంతి): ఈ రోజు హసన్ పర్తి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మన్ కీ బాత్(Mann Ki Baat) 122వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని వీక్షించిన రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం చైర్మన్ మర్తినేని ధర్మారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, ఆపరేషన్ సింధూర్ భారత రక్షణ శక్తి, గిర్ అటవీ సింహాల పెరుగుదల, సిక్కిం నేసకళకు ఆధునిక మేళితం, జీవన్ జోషి ప్రతిభకు ప్రేరణ, వ్యవసాయ డ్రోన్ డిడీలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, తేనె ఉత్పత్తి స్వీట్ రివల్యూషన్, స్కూల్‌లలో ఆరోగ్యకర అలవాట్లు, ఐటిబిపి శిఖర శుభ్రత మిషన్, పేపర్ రీసైక్లింగ్‌లో స్టార్టప్‌లు, ఖేలో ఇండియా క్రీడా అభివృద్ధి, ఆయుర్వేద ప్రోత్సాహం, పై అంశంలో గురించి ప్రధానమంత్రి మోదీ మన్ కి బాత్ లో ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పిట్టల కుమారస్వామి, రైల్వే బోర్డు మెంబర్ దాసరి రాజు, మేకల హరి శంకర్, హసన్ పర్తి మండల అధ్యక్షులు మారం తిరుపతి, మండల కార్యదర్శి దాది మధుసూదన్, సీనియర్ నాయకులు చేకిలం రాజేశ్వరరావు, మట్టెడ సుమన్, పెద్దమ్మ నరేష్, మారం కుమార్, పెద్దమ్మ కుమారస్వామి, మారం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.