calender_icon.png 26 May, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌరెడ్డిపేటలో విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి

25-05-2025 06:47:26 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) గౌరెడ్డిపేట గ్రామంలో రైతు బబ్బూరి శ్యామ్ కు చెందిన ఎద్దు పొలం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగలడంతో షాక్ తగిలి మృతి చెందింది. గ్రామానికి  రైతు ఆదివారం మేత కోసం వెళ్లగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ వైర్లు తెగిపడడంతో పాటు ట్రాన్స్ఫర్ సమీపంలో ఉండడంతో ఎద్దు మేతకు పోగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందిందని రైతు రోధిస్తూ తెలిపారు. తన ఎద్దు విలువ దాదాపు రూ.60,000 ఉంటుందని వాపోయాడు. ప్రభుత్వం తనకు ఆర్థిక సాయం చేసే ఆదుకోవాలని రైతు అధికారులను కోరారు.