25-05-2025 06:30:34 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగ నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాల(Saraswati Pushkaralu)లో త్రివేణి సంగమమైన దక్షణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలో (12) సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలలో పితృదేవతలతో పాటు (33) మంది బంధువులకు పిండ ప్రదానాలు చేయవచ్చని, తద్వారా వారి ఆత్మ వివిధ రూపాలలో వచ్చి పిండాలను స్వీకరించి మనస్ఫూర్తిగా ఆత్మ శాంతిగా ఉంటాయని, శేఖరం స్వామి శ్రీశైలం పండితులు తెలిపారు.
పండితులు మాట్లాడుతూ... మే 14, రాత్రి మిధునరాశిలో బృహస్పతి ప్రవేశించిన సమయం నుండి 12 రోజుల పాటు గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతినది కలిసి సరస్వతి మహా పుష్కరాలు ప్రారంభమయ్యాయని, సాధారణ సమయాలలో తండ్రి, తల్లి, తాతలు పితృదేవతలకు మాత్రమే పిండ ప్రదానాలు చేయడం జరుగుతుందని ఈ సరస్వతీ పుష్కరాలలో మన పితృదేవతలతో పాటు కుల బంధువులు (33) మందికి పిండ ప్రదానాలు చేస్తే వారికి ఆత్మలకు మనశ్శాంతి చేకూరుతుందన్నారు.
నల్ల నువ్వులు, పంచామృతాలతో పిండ ప్రదానాలు ఈ సరస్వతీ పుష్కరాలలో భక్తులు అధిక సంఖ్యలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పితృదేవతలకు పిండాలు సమర్పించడం జరుగుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కాశీ తదితర ప్రాంతాల నుండి వచ్చిన వేద పండితులు భక్తులకు అందుబాటులో ఉంటూ పిండ ప్రదానం చేస్తున్నారని ఆయన తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులు తమ పూర్వికులకు పిండ ప్రదానాలు చేసి వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా, వారి కుటుంబం సుఖశాంతులతో ఉండే విధంగా పిండ ప్రదానాలు చేసుకోవచ్చని పండితులు తెలిపారు.