calender_icon.png 15 December, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ

15-12-2025 03:53:37 PM

హైదరాబాద్: రవీంద్రభారతి ప్రాంగణంలో(Ravindra Bharathi) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ జరిగింది. బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam statue) కాంస్య విగ్రహాన్ని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, రామచందర్ రావు హాజరయ్యారు. 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో రూపొందించారు. విగ్రహావిష్కరణ అనంతరం బాలసుబ్రహ్మణ్యం ఇష్టపడే పాటలతో 50 మందితో సంగీత విభావరిని కార్యక్రమం ఏర్పాటు చేశారు. గాయకులు బాలసుబ్రహ్మణ్యం ఇష్టపడే 20 గీతాలను ఆలపించనున్నారు. రవీంద్ర భారతిలో తన విగ్రహం పెట్టాలన్నది బాలు చివరి కోరికని, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే బాలు విగ్రహాలు ఉన్నాయని ఎస్పీ శైలజ తెలిపారు.