15-12-2025 04:37:24 PM
మఠంపల్లి (విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కృష్ణ తండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బానోతు రమాదేవి శంకర్ నాయక్ ను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. వారు మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. వారి సహకారంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక ప్రకారం అందరికీ న్యాయం చేసేందుకు, ప్రభుత్వం అందించే పథకాలు అందరికీ అందేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్, గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణ నాయక్, ఉపసర్పంచ్ శంభయ్య, వార్డు సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.