calender_icon.png 15 December, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్సలెన్స్ అవార్డు రావడం సంతోషకరం..

15-12-2025 04:51:21 PM

పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్

సుల్తానాబాద్ (విజయక్రాంతి): స్కూల్స్ ఎక్సలెన్స్ అవార్డు లభించడం ఎంతో సంతోషకరమైన విషయమని ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌ లో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఎట్ టేక్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు’ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. సోమవారం పాఠశాల వేదికగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియలకు పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అందించాలనే లక్ష్యంతో పాఠశాల ముందుకు సాగుతోందని తెలిపారు. ఉపాధ్యాయుల అంకితభావం, ప్రిన్సిపల్ కృష్ణప్రియ నాయకత్వం, విద్యార్థుల కృషి ఫలితంగానే ఈ అవార్డు లభించిందన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన విద్యా ప్రమాణాలు నెలకొల్పి, జాతీయస్థాయిలో గుర్తింపు సాధించే దిశగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డు పాఠశాల సిబ్బందికి, విద్యార్థులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.