15-12-2025 03:39:55 PM
మునుగోడు,(విజయక్రాంతి): ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలలో బిఆర్ఎస్ బరిలో నిలిచిన చెన్నగోని కాటమరాజు గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని ఓబీసీ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బూడిద లింగయ్య యాదవ్ అన్నారు. కాటమరాజు స్వగ్రామం కిష్టాపురం గ్రామానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించి, అతని పార్థివ శరీరానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్ చిమల రాజు యాదవ్, అవుల శ్రీనివాస్ యాదవ్, బొజ్జ శ్రీనివాస్ తో కలిసి ఆ కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కిష్టాపురం మాజీ ఉప సర్పంచ్ అకుల అనిల్, అకుల లింగస్వామి, బకి శ్రీకాంత్, అంతటి అంజయ్య గౌడ్, రేవిల్లే నరసింహ ఉన్నారు.