calender_icon.png 15 December, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయాధారిత పరిశ్రమలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కీలకం

15-12-2025 03:37:18 PM

వీరభద్ర రైస్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

రేగొండ,(విజయక్రాంతి): వ్యవసాయాధారిత పరిశ్రమలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కీలకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం రేగొండ మండలం భాగిర్దిపేట క్రాస్ రోడ్డులో ఎస్బిఐ భూపాలపల్లి వారి సహకారంతో ఏర్పాటు చేసిన శ్రీ వీరభద్ర రైస్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించాలంటే ఇలాంటి పరిశ్రమలు మరింతగా అవసరమని అన్నారు.

ఈ రైస్ మిల్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రైతులకు రవాణా ఖర్చులు తగ్గి లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి అనుకూల విధానాలు అమలు చేస్తోందని, స్థానిక పెట్టుబడిదారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట రామన్నగూడెం గ్రామ సర్పంచ్ గుగులోత్ రవళిక - వీరూ నాయక్ తదితరులు ఉన్నారు.