calender_icon.png 15 December, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటమరాజు మరణం బిఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టం

15-12-2025 03:33:46 PM

- అత్యవసర సహాయంగా 50 వేలు అందజేత

- మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మునుగోడు,(విజయకాంతి): చెన్నగోని కాటమరాజు మరణం బిఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టం అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం మునుగోడు మండలం కిస్టాపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, గుండె పోటుతో మరణించడం బాధాకరమని అన్నారు. పార్టీకి కాటమరాజు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, అతని కుటుంబానికి తాను ఎల్లవేళలా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అతని కుటుంబానికి అత్యవసర సహాయంగా 50,000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మందుల సత్యం, మండల నాయకులు మదనబోయిన పరమేష్, సర్పంచ్ గజ్జల బాలరాజు,నంది పాటి వెంకన్న, పూల వెంకన్న మండల,పార్టీ నాయకులు ఉన్నారు.