శ్రీ శ్రీ రాజరాజేశ్వర స్వామి, శివపంచాయత, ధ్వజ స్తంభ శిఖర స్థిర ప్రతిష్ఠ మహోత్సవం
విగ్రహ ప్రతిష్టోత్సవ కార్యక్రమానికి హాజరైన బిజెపి ఎంపి ఈటల రాజేందర్
మేడ్చల్ అర్బన్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి పట్టణ సమీపంలో గల సుతారీగూడ లో శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వర స్వామి శివ పంచాయత శ్రీ రామచంద్ర స్వామి నవగ్రహ ధ్వజస్తంభ శిఖర స్థిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి బిజెపి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు మాజి మంత్రి వర్యులు ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమాన్ని దర్శించారు.
అనంతరం భక్తులతో కలిసి హారతులు అందుకొని దేవతల ఆశీస్సులను ఈటల రాజేందర్ పొందారు.ఆలయ నిర్మాణం శిఖర ప్రతిష్ట వంటి పవిత్ర కార్యక్రమాలు పట్టణ అభివృద్ధికి ఆధ్యాత్మిక చైతన్యానికి దోహదపడతాయని ఎంపి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ బిజెపి రాష్ట్ర నాయకులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి.గోపు రమణారెడ్డి మాజీ కౌన్సిలర్ లు దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్.సాకరబోయిన రజిత వెంకటేష్ ముదిరాజ్.జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సముద్రాల కృష్ణ గౌడ్ నాయకులు సాకరబోయిన వెంకటేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.






