18 June, 2026 | 10:31 AM

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి

17-08-2024 01:31 AM

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి):  పశ్చిమ బెంగాల్‌లో  మహిళా సీఎం ఉన్నా మహిళలకే రక్షణ కరువవుతోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి  విమర్శించారు. బెంగాల్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయని  ఆయన ఆరోపించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు.   కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో మహిళా ట్రైనీ డాక్టర్ హత్య అత్యంత బాధాకరమైన సంఘటనగా ఆయన పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో మమత సర్కారు తీవ్ర నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ఈ కేసును సీబీఐకు బదిలీ చేయడానికి ఆలస్యం చేశారన్నారు.