24-09-2025 03:16:18 PM
నల్గొండ టౌన్, (విజయక్రాంతి): నల్లగొండ పట్టణంలోని 11వ వార్డు ఇందిరమ్మ కాలనీలోని అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసాన్ని పురస్కరించుకొని బుధవారం గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూలు, పండ్లు అందజేసి గాజులు తొడిగి సీమంతాలను నిర్వహించారు. అనంతరం సూపర్వైజర్ మల్లేశ్వరి మాట్లాడుతూ గర్భిణులు పోషకాహారాన్ని తీసుకుంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ లు విజయలక్ష్మి, సునీత, రమాదేవి, ఉమామహేశ్వరి, హెల్పర్ రమణ, కాలనీవాసులు పలువురు పాల్గొన్నారు.