calender_icon.png 24 September, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి కేంద్రంలో బతుకమ్మ సంబరాలు

24-09-2025 03:10:52 PM

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట పట్టణంలోని కాళ్లకుంట కాలనీ 3వ అంగన్వాడి కేంద్రంలో బుధవారం బతుకమ్మ సంబరాలు(Bathukamma celebrations) నిర్వహించారు. తల్లులు, గర్భవతులు, కిశోర బాలికలు, అంగన్వాడి పిల్లలు బతుకమ్మ సంబరాలలో పాల్గొని ఆడి, పాడారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేయడంతో పాటు లబ్ధిదారులకు అంగన్వాడి సేవలను వివరించడంలో భాగంగానే సంబరాలు నిర్వహించినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వప్న తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్ యమున, ఆయమ్మ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.