calender_icon.png 24 September, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిల్‍సుఖ్‍నగర్ మెట్రో స్టేషన్ వద్ద నిరుద్యోగుల నిరసన

24-09-2025 03:06:39 PM

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు(Unemployed) హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్ వద్ద నిరసన చేపడుతున్నారు. దిల్‍సుఖ్‍నగర్ మెట్రో స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఆందోళన పాల్గొన్న నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. ఈ నిరసన కారణంగా దిల్‍సుఖ్‍నగర్ మెట్రో స్టేషన్(Dilsukhnagar metro station) వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

జాబ్ క్యాలెండర్ తక్షనమే విడుదల చేయాలంటూ యువతీయువకులు బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అప్రమత్తం అయిన పోలీసులు సంఘటనా స్థలంలో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్‌ను జూన్‌లో విడుదల చేయబోతోందని గతంలో ఒక నివేదిక వచ్చింది. గత సంవత్సరం, తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 2న క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇప్పుడు, నిరుద్యోగులు తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2025-26 విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్ వద్ద నిరసన తెలుపుతున్నారు.