calender_icon.png 24 September, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బచ్చు తిరుమల రావుకు నివాళులర్పించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

24-09-2025 03:13:57 PM

తుంగతుర్తి, (విజయ క్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన సీఈవో ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బచ్చు రాఘవేంద్రరావు తండ్రి బచ్చు తిరుమల రావు  అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. కాగా, బుధవారం విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి(Former Minister Jagadish Reddy) ఆయన నివాసానికి చేరుకొని తిరుమల రావు భౌతిక దేహానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగానీ రాములు గౌడ్, తునికి సాయిలు, గాజుల యాదగిరి, గుండ గాని దుర్గయ్య, మాజీ జెడ్పిటిసి తాటి విజయమ్మ, గోపగాని రమేష్, శ్రీనివాస్, తడకమల్ల రవికుమార్, వీరోజి, గుడిపాటి వీరయ్య, గునీగంటి యాదగిరి, స్థానికులు సకినేని గోవర్ధన్ రావు, గుడిపూడి శ్రీనివాసరావు, కోదాటి వెంకన్న ,విక్రం ,తదితరులు ఉన్నారు.