24-09-2025 03:21:33 PM
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సాయి బాలాజీ సిండికేట్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం వాసవి కన్యకా పరమేశ్వరి మాతను గాయత్రీ దేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు జోషి పాండురంగ శర్మ ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ఆలయానికి విచ్చేసి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శివకుమార్, ఆలయ అధ్యక్షుడు వాస ఈశ్వరయ్యతో పాటు కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, వాసవి మాత కరుణాకటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. మహా నీరాజనం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.