24-09-2025 03:09:31 PM
-ఘనంగా పూజలు -
మందమర్రి, (విజయక్రాంతి): దుర్గాదేవి శరన్నవరాత్రి పూజ మహోత్సవాలు పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణం లోని దుబ్బగూడెం శ్రీశ్రీశ్రీ దుర్గా భవాని సేవ మండలి ఆధ్వర్యంలో దుర్గా దేవి నవరాత్రి పూజా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు బుధవారం అమ్మవారు అన్నపూర్ణ దేవి గా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మండపంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు.
ఈసందర్భంగా మండపం నిర్వాహకులు రామటెంకి దుర్గ రాజు మాట్లాడుతూ 2003 సం,, నుండి ప్రతి సం,, దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల, దాతల సహకారంతో గత దశాబ్ద కాలంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నామన్నారు పట్టణ ప్రజలు అమ్మవారిని దర్శించుకుని దుర్గామాత కృపా కటాక్షాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కోలేటి శివప్రసాద్, రామటెంకి పోషం, చెలిమేటి చంద్రమౌళి, దేవరకొండ లక్ష్మణ్, దుర్గం శివరామకృష్ణ, సాయి రాజ్, రాహుల్ లు పాల్గొన్నారు.