calender_icon.png 24 September, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

24-09-2025 03:12:23 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి కి వినతిపత్రం అందజేత

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి):  మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి కి వినతిపత్రం అందజేశారు.మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మికులు గత ఆరు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బకాయిల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.వేతనాల సమస్యతో పాటు కార్మికులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను ఎమ్మెల్యే కు కార్మికులు వివరించారు. అన్ని సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కోవ లక్ష్మి హామీ ఇచ్చారు.