01-05-2025 12:34:41 AM
ఖమ్మం, ఏప్రిల్ 30 ( విజయక్రాంతి ):-జమ్ము కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో చోటుచేసుకున్న ఉగ్రదాడిపై ఖమ్మం ప్రజలు భగ్గుమన్నారు. బుధవారం నగరంలోని వైరా రోడ్డులో ఉన్న తనిష్క్ జువెలరీ సమీపంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ జెండాను కాలితో తొక్కు తూ ఉగ్రవాదాన్ని నశింపజేయాలి, పాక్ మూర్ఖత్వానికి చివరిరోజు దగ్గరపడింది అంటూ నినాదాలు గుప్పించారు.తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కొల్లూ మాధవి, ఖ మ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వ హించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రతా దళాలపై జరిగే దాడులను సమాజం తట్టుకోదని, భారత్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో గుత్తా వెంకటేశ్వరరావు, మం ద సరస్వతి, వేల్పుల సుధాకర్, నీరుకొండ ఉషారాణి, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, గుగులోతు నాగేశ్వరరావు, అల్లిక అంజయ్య, విజ యరెడ్డి, అనిత, దొడ్డ అరుణ, బండారు నరేష్, తోడుపునూరి రవీందర్, రవి రాథోడ్, నెల్లూరు బెనర్జీ, గడీల నరేష్, అంకతి పాపారావు, కుమిలి శ్రీనివాస్, మాధవ్, మణి, కొమ్మ మధు, దాసు, రజనీరెడ్డి పాల్గొన్నారు.