01-05-2025 12:36:19 AM
32వ స్థానానికి దిగజారిన కుమ్రంభీం ఆసిఫాబాద్ ఉత్తీర్ణత
కుమ్రం భీం ఆసిఫాబాద్,ఏప్రిల్30( విజ యక్రాంతి): టెన్త్ ఫలితాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఈ ఏడాది వెనకంజలో నిలి చింది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థ్దానం కిందకి దిగజారింది. గత ఏడాది 31వ స్థ్దాయి లో నిలిచిన జిల్లా ఈసారి 32వ స్థ్దానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 6,480 మంది పరీక్షలు రాయగా 5,654 మంది పాసయ్యా రు.
3,035 మంది బాలురులు పరీక్షలు రాయగా 2,539 మంది పాస్ అయ్యారు. 3,445 మంది బాలికలు పరీక్షలు రాయగా 3,115 మంది పాసయ్యా రు. జిల్లాలో 87.25 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది.
గురుకుల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి ఫలితాల్లో జిల్లా కేంద్రంలో పీవీటీజీ పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పిటిజిలో 56 విద్యార్థు లు పరీక్ష రాయగా 51 మంది పాస్ అయ్యా రు. 90 శాతం విద్యార్థులు ఉత్తీర్ణు లయ్యా రు. అత్యధికంగా ఈ.విష్ణువర్ధన్ 519 మార్కు లు సాధించారు. ఎంజెపి బాలికల పాఠశాల లో 69 మంది పరీక్షలు రాయగా 68 మంది ఉత్తీర్ణత సాధించారు.లిఖిత 556 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలువగా ఐశ్వ ర్య 553 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలవడంతో ప్రిన్సిపాల్ రత్నాబాయి విద్యార్థులను అభినందించారు.