2 July, 2026 | 3:14 AM

అవినీతిపై విచారణ చేపట్టాలని బీజేపీ నిరసన

02-07-2026 02:05 AM

మంచిర్యాల అగ్రికల్చర్, జూలై 1 : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని, సమస్యలపై ప్రశ్నించిన బీజేపీ కార్పొరేటర్ల ను సస్పెండ్ చేయడం, బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ బుధ వారం డీసీపీ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ లు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి, నిధులు దుర్వినియోగంపై వెంటనే విచారణ చేపట్టి బీజేపీ కార్పొరేటర్లు, నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

మంచిర్యాల కార్పొరేషన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చెందుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏమి ఇవ్వడం లేదని, జిల్లాలోని మున్సిపాలిటీలకు కేంద్రం అమృత్ పథకం కింద మంచి నీటి సరఫరా కోసం, చెరువుల అభివృద్ధికి రూ. 320 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. అనంతరం డీసీపీ భాస్కర్ కి వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బోట్ల అనిత, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఎనగందుల కృష్ణ మూర్తి, పట్టి వెంకట కృష్ణ, అక్కల రమేష్, వైద్య శ్రీధర్, రాచర్ల సంతోష్, అమిరిశెట్టి రాజ్ కుమార్, సత్రం రమేష్, గోపతి రాజయ్య, ఆకుల అశోక్ వర్ధన్, పచ్చ స్వప్న రాణి, ఆడే ప్రేమ్ సింగ్, బేర సత్యనారాయణ, డేగ బాపు, మోతె సుజాత, బైరం లక్ష్మి, స్వరూప రాణి, బొద్దున మల్లేష్, నల్ల రవి, బందెల రవి గౌడ్, బొప్పు కిషన్, బల్జపల్లి తిరుపతి తతిదరులు పాల్గొన్నారు.