25-07-2025 08:42:42 PM
మాజీ పార్లమెంట్ కన్వీనర్ నక్క వెంకటేష్ యాదవ్
దేవరకొండ: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం బీజేపీ కొండమల్లేపల్లి మండల పార్టీ అధ్యక్షులు భూతరాజు భరత్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ పార్లమెంట్ కన్వీనర్ నక్క వెంకటేష్ యాదవ్ హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే స్ధానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. మండల పార్టీ అధ్యక్షులు భరత్ కుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మండలంలో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందన్నారు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా ఆరువేల రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తుంది అన్నారు రేషన్ కార్డుల ద్వారా ఒక్కొక్కరికి ఐదు కేజీ ల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. యువకులకు రానున్న ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇస్తామని వారు అన్నారు.