26-07-2025 12:56:21 PM
- స్థానికుల సాయంతో ఓడ్డుకు చేర్చగా అప్పటికే మృతి.
కల్వకుర్తి: వరుసగా కురుస్తున్న ముసరు వర్షాలకు దుందుభి వాగు(Dundubi Vaagu) ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడు కల్వకుర్తి మండలం(Kalwakurthy Mandal) రఘుపతిపేట వద్ద ఉన్న దుందుభి వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన కురువ సొంటె పెద్ద జంగయ్య(65) వంగూర్ మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి వద్ద ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు వాగు దాటుతున్న క్రమంలో కాలుజారి వాగులో గల్లంతయ్యాడు. స్థానికులు గుర్తించి వెంటనే తనను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. వాగు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.