26-07-2025 12:53:45 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): హుజురాబాద్ ఎమ్మెల్యే పాడే కౌశిక్ రెడ్డి(Huzurabad MLA Padi Kaushik Reddy) దిష్టిబొమ్మను శనివారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు వద్ద కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కౌశిక్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, ఎన్నారై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అంతంపల్లి సుధాకర్ రెడ్డి, లింబాద్రి, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.