calender_icon.png 26 July, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

తిరుమల ఘాట్ రోడ్డులో బైకర్ పై చిరుత దాడి

26-07-2025 11:53:44 AM

  1. అలిపిరి, ఎస్వీ జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం.
  2. రాత్రి బైక్ పై వెళ్తున్న వారిపై దాడికి యత్నించిన చిరుత.
  3. తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు.
  4. వరుస ఘటనలతో భయందోళనలో ప్రయాణికులు.

తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులో(Tirumala Ghat road) ఒక చిరుతపులి బైకర్ పై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు సోషల్ వీడియో వైరల్ గా మారాయి. ఆ ఫుటేజీలో చిరుతపులి దంపతుల వైపు దూసుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ దాడి విఫలమైంది. ఈ సంఘటనను బైక్ వెనుక ప్రయాణిస్తున్న వాహనం రికార్డు చేసింది. చిరుతలు, ఇతర అడవి జంతువులు సమీపంలో కనిపించడంతో యాత్రికులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు. వరుస ఘటనలతో ప్రయాణికులు భయందోళనకు గురవుతున్నారు.