calender_icon.png 7 May, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోళ్లపాడు గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

06-05-2025 06:12:44 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) మంగళవారం సందర్శించారు. త్వరలో శంకుస్థాపన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఎంపిక అయినటువంటి అర్హులైన లబ్దిదారుల ప్రతీ ఇంటిని సందర్శించి పథకాన్ని దూర్వినియోగం చేయకుండ పారదర్శకంగా ఎంపిక పక్రియ చేయాలనీ ఇందిరమ్మ కమిటీ సభ్యులకు తగు సూచనలను చేసారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ... మొదటి విడతలో ఇండ్లు రానివారు నిరాశ చెందవద్దని అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇండ్లు మంజూరు ఈ ప్రభుత్వంలో అవుతుందని హామీ ఇచ్చారు. లబ్దిదారులు అధికారులు ఇచ్చినటువంటి నమూనా ప్రకారం ఇండ్లు నిర్మాణం ప్రారభించాలని 400 చదరపు అడుగులు తగ్గకుండ 600 చదరపు అడుగులు మించకుండా ఇండ్లు నిర్మించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్, ఎంపీఓ గణేష్ గాంధీ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్, శివ, ఊళ్ళోజు ఉదయ్, సర్దార్, బొడ్డు అశోక్, స్థానిక పంచాయతీ సెక్రటరీ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.