30-07-2025 12:20:33 AM
కామారెడ్డి, జులై 29 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించి విజయ డంక మోగిస్తానని రాష్ట్ర బిజెపి నాయకులు పైడి ఎల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు లతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని వారు సూచించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అన్ని జెడ్పిటిసి, ఎంపీపీ స్థానాలను బిజెపి కైవసం చేసుకునేలా కృషి చేస్తానని పైడి ఎల్లారెడ్డి ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డికి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలని వారు ఈ సందర్భంగా సూచించినట్లు పైడి ఎల్లారెడ్డి తెలిపారు.