30-07-2025 01:32:51 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ పరిధిలోని విద్యుత్ ఎంప్లాయిస్ కాలనీ లోగల వాకింగ్ ప్రదేశంలో కాంట్రాక్టర్ సుధాకర్ బుధవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఉదయం వాకింగ్ కు వెళ్లిన వారు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.