30-07-2025 12:52:30 PM
వనపర్తి, (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా సొంతింటి నిర్మాణం కోసం కళ్ళు గన్న కుటుంబాలు నేడు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలతో వారి సొంతింటి కలలను నెరవేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు మేఘా రెడ్డి(Wanaparthy MLA Megha Reddy ) ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వనపర్తి నియోజకవర్గం ఏదుల మండలం చీర్కపల్లి గాంధీనగర్ కాలనీలో దేవరీ రేణుక w/o ఎల్ల స్వామి నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గృహ నిర్మాణం చేసుకున్న కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందించి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో ఇల్లు లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు అనుభవించారని నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి రూ ఐదు లక్షల రూపాయల ఖర్చుతో సొంతింటి కల సహకారం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.వనపర్తి నియోజకవర్గ మొత్తంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం అవుతున్నాయని మరో 2000 ఇండ్లను అదనంగా మంజూరు చేయించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ మూడేళ్ల కాలంలో నియోజకవర్గంలో పూరిగుడిసె, రేకుల ఇల్లు, పాత మట్టి మిద్దెలు లాంటివి లేకుండా అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి ఇంటి ఇబ్బందులు తొలగించి సొంత ఇంటి కల నెరవేరుస్తామన్నారు. గోపాల్పేట ఉమ్మడి మండలం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సత్యశీలరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రఘు యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కొంకి వెంకటేష్, రేవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జమ్మి మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పందెం సుఖేందర్ రెడ్డి, సురేష్ గౌడ్, బాలస్వామి, చీర్కపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాములు, వెంకటస్వామి, రవి, కాశీం, రామకృష్ణ, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.