30-07-2025 12:18:57 AM
రాజన్న సిరిసిల్ల, జూలై 29 (విజయక్రాం తి): బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలు మోసం చేస్తున్నదని, జరుగుతున్న మోసాన్ని బీసీలకు వివరించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపం పెరిగిపోయిందని, రాను న్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెపుతారని చెప్పారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో నియోజకవర్గంలోని తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయి నపల్లి మండలాల్లోని బీఆర్‌ఎస్ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు.
పల్లెల్లో మౌలిక వసతుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవ డం లేదని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి, అవినీతి అరాచకాలకు తెరలేపిందని ఆరోపించారు.
ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన కాంగ్రెస్, ఒక్క హామీని కూడా అమలు చేయని ప్రభుత్వంగా నిలిచిందని ఎద్దేవా చేశారు. రైతులకు, నిరుద్యోగులకు, వృద్ధులకు, మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను విస్మరించి, ఉత్తమాటలతో కాలం గడుపుతోందని విమర్శించారు.
కేవలం ఓట్ల సమయంలోనే రైతు బంధు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వ్యవసాయం బాగుపడాలంటే మళ్లీ కేసీఆర్ రావాలన్నది ఇప్పుడు రైతుల అభిప్రాయమని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర యువతను విద్యార్థులను తీవ్రంగా మోసం చేసిందని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గడపకీ తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. సమన్వయంతో, ఐక్యంగా పనిచేస్తూ గులాబీ జెండాను ఎగరవేయాలని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కాగా సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ను ఓడించే నాయకుడే లేడని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులే కనబడడం లేదని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిస్తే పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభు త్వ అధికారులంతా మీకు సహకరిస్తారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం స్థానిక ఎమ్మెల్యేగా అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చా రు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రవిశంకర్ పాల్గొన్నారు.