30-07-2025 01:29:33 PM
రాంచంద్రరావుకు పోనిశెట్టి ఆధ్వర్యంలో ఘన స్వాగతం
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలి సారి పాల్వంచలో పర్యటించిన ఎన్. రాంచంద్రరావుకు బుధవారం పోలిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతించారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు పూలమాలలతో హర్షధ్వానాలతో రాంచంద్రరావు ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక నాయకులు మాట్లాడుతూ... రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, రాష్ట్రంలో బీజేపీని బలమైన ప్రత్యామ్నాయంగా నిలిపేందుకు రాంచంద్రరావు నాయకత్వం కీలకమవుతుందన్నారు. పాల్వంచ ప్రజలు పార్టీ కార్యకర్తల్లో ఈ పర్యటనతో కొత్త ఉత్సాహం నెలకొంది.