calender_icon.png 31 July, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్యాలో భారీ భూకంపం.. పసిఫిక్ తీరంలో సునామీ

30-07-2025 01:17:47 PM

పసిఫిక్ తీర ప్రాంతాలను వణికిస్తున్న సునామీ హెచ్చరికలు

మాస్కో: రష్యాలో తీవ్ర భూకంపం(Russia Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 8.8గా నమోదైంది. రష్యాలోని కామ్చాట్ స్కీ ప్రాంతం(Kamchatka Peninsula), జపాన్ కు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. హెచ్చరికలు చేసిన కాసేపటికే సునామీ రష్యా, జపాన్ ను తాకాయి. భూకంపంతో రష్యా కామ్చాట్ స్కీలో విద్యుత్, సెల్ ఫోన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జపాన్ అత్యవసర సేవలు అందించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. హోనోలులులో సునామీ హెచ్చరిక సైరన్లు(Warning sirens) మోగాయి. ముప్పు తగ్గేవరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సునామీ కారణంగా జపాన్ తీరంలో(Coast of Japan) 3 మీటర్ల వరకు అలలు ఎగిసిపడ్డాయి. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. సునామీ ముప్పుతో భారత్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. భారత కాన్సులేట్ జనరల్ తీరం నుంచి దూరంగా వెళ్లాలని సూచించారు. హవాయి, చిలీ, సోలెమన్ దీవులకు, అలస్కా, ఒరెగాన్, వాషింగ్టన్(Washington)లోని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. పసిఫిక్ తీర ప్రాంతాలను సునామీ హెచ్చరికలు వణికిస్తున్నాయి. రష్యా, జపాన్ తీరాలను సునామీ తాకింది. రష్యాలో తీవ్ర భూకంపంతో సునామీ రష్యా, జపాన్ తీరాలను తాకింది. అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోనూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.