calender_icon.png 31 July, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాశమైలారంలో పెద్ద శబ్దంతో పేలుడు.. పరుగులు పెట్టిన స్థానికులు

30-07-2025 12:42:49 PM

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో(Pashamylaram industrial estate) బుధవారం పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. రసాయన డ్రమ్ములు తగలబెడుతుండగా పెద్ద శబ్దం వచ్చి మంటలు అంటుకున్నాయి. పేలుడు శబ్దం విన్న స్థానికులు ప్రాణభయంతో దూరంగా పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.  జూన్ 30న ఉదయం హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డి పాశమైలారంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మాస్యూటికల్ యూనిట్‌లో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ కూలిపోయినప్పుడు ఎక్కువ మంది బాధితులు దాని కింద చిక్కుకున్నారు. సంగారెడ్డి పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 43 మంది మరణించారు.