23-07-2025 01:22:52 AM
- రాష్ట్ర అధ్యక్షుడికి అవగాహన లేదు
- బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ చిరంజీవులు
ముషీరాబాద్, జూలై 22: బీసీల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరికి పాల్పడుతు న్నదని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మండిపడ్డారు. మంగళ వారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిరంజీవులు మాట్లాడారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల లిస్టులో కేంద్రంలోని ఓబీసీల జాబితాలో కూడా ముస్లింలు ఉన్నారు కదా? ఈ అంశం పై బీజేపీ ఎందుకు మాట్లాడదని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఢిల్లీలో చేసిన ప్రకటనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని గత కొద్ది నెలల నుంచి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేద న్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వంగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
బీసీల ఓట్లతో గద్దెనెక్కి కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతుందని, ఇక ఊరుకునేది లేదని హెచ్చరిం చారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ముందు న్యాయపరమైన అంశా లు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎన్నోసార్లు చెప్పామని, అయినా పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుకి న్యాయపరమైన అవగాహన లేదని విమర్శించారు. తెలంగాణలో 42 శాతం బీసీ రిజ ర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టే విధం గా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేయాలని సూచించారు.
బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు అపరిపక్వత ప్రకటనలు చేస్తున్నా రని, దమ్ముంటే బీసీ మేధావులతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో చామకూర రాజు, కెవి గౌడ్, చెన్నా శ్రీకాంత్, కిరణ్ కుమార్ గౌడ్, శివ ముదిరాజ్, షామీర్పేట రాజేష్, దుర్గయ్య గౌడ్, ఎర్రమాధ వెంకన్న, అయిలు వెంకన్న గౌడ్, అవ్వారు వేణు, బైరు శేఖర్, కొండల్ గౌడ్, కోలా జనార్ధన్, లింగేష్ యాదవ్, నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, ఆంజనేయులు, సింగం నాగేశ్వర్ గౌడ్, రాకేష్ గౌడ్, శివ ముదిరాజ్, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.