23-07-2025 01:24:27 AM
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. ఆయా సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
మంగళవారం సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, భూభారతి, వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లలో భోజన, మౌలిక వసతుల ఏర్పాటు, వనమహోత్సవంలో మొక్కలు నాటడం, మహాలక్ష్మి పథకం తదితర అంశాలపై సమీక్ష చేశారు.
వివిధ అంశాల వారీగా జిల్లా కలెక్టర్లకు మంత్రులు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు కలెక్టర్లు, అధికారులు నిర్విరామంగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని, క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, అధికారులు ముఖ్యపాత్ర పోషించి ఫలితాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని మంత్రులు స్పష్టం చేశారు.
వారంలో ఒకరోజు హాస్టల్‌లో నిద్ర
సాంఘిక, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మంత్రులు సూచించారు. హాస్టళ్లలో నిర్వాహణపై ఎప్పుటికప్పుడు తనిఖీలు నిర్వహించి వారంలో ఒక్కరోజు అధికారులందరూ ఆ హాస్టళ్లలో బస చేయాలని కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు. హాస్టళ్ల ప్రాంగణాల్లో పచ్చదనం పరిశుభ్రతల్లో భాగంగా శానిటేషన్‌ను చేపట్టాలని, అన్ని జిల్లాల్లో ఎగ్ టెండర్స్ ప్రక్రియను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు.
విద్యార్థుల తల్లిదండ్రులతో నెలకోసారి పేరెంట్స్ కమిటీ మీటింగ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎస్ రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు వీటి నిర్వాహణపై పలు సూచనలు చేశారు. పెంచిన డెట్ ఛార్జీలకు అనుగుణంగా నాణ్యమైన భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావొద్దని అధికారులకు సూచించారు.
అర్హులైన ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇళ్లు
ప్రభుత్వ లక్ష్యాల మేరకు అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణంలో ఇసుక కొరత లేకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారునికి ఉచితంగా ఇసుక అందజేయాలన్నారు.
ఇసుక రవాణా విషయంలో ఎలాంటి భారం కలుగకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి వారం దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతిని సమీక్షిస్తానని మంత్రి తెలిపారు. భూభారతిలో నమోదెన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో విరివిగా మొక్కలు నాటాలని అధికారులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ముఖ్యకార్యదర్శులు నదీమ్, ఎన్.శ్రీధర్, దానకిషోర్, నవీన్‌మిట్టల్, యోగితారాణా, క్రిస్టినా జెడ్ చొంగ్తూ, కార్యదర్శులు లోకేశ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, వీపీ గౌతమ్, పీసీసీఎఫ్ సువర్ణ, ఇ.శ్రీధర్, సృజన, అధికారులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లపై బీజేపీది ద్వంద్వ వైఖరి
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిపై మండిపడ్డ మంత్రి పొన్నం
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాం చందర్‌రావు మరోసారి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారని మం త్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెం చుతూ 9వ షెడ్యూల్‌లో చేర్చడం అసాధ్యం అంటున్నారని, కానీ ఇది సాధ్యమేనని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. గతంలో తమిళనాడులో సా ధ్యమైనది ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.
తెలంగాణ బీజే పీ ఎంపీలు రాజీనామా చేస్తే, ఎందు కు రిజర్వేషన్లు అమలు కావో తెలుస్తుందన్నారు. ప్రామాణికమైన స మాచారం, ఎంపెరికల్ డేటా ఉంటే ఆ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారని, అందుకే రాష్ర్ట ప్ర భుత్వం సర్వే చేసి క్యాబినెట్ ఆమో దం, శాసనసభ ఆమోదం, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీకి ఫైల్ పంపిందని తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి న అంశమని స్పష్టం చేశారు.
రాష్ర్ట ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉం దని, బరాబర్ రిజర్వేష న్లు అధికారికంగా అమలు చేస్తామని వెల్లడించా రు. అన్ని బీసీ వర్గాలు, కుల సంఘా లు బీజేపీ నిజస్వరూపా న్ని గమనించి రిజర్వేషన్లను కాపాడుకునేందు కు ముందుకు రావాలని పి లుపునిచ్చారు. కేంద్రం 42శాతం బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిందేనన్నారు.