calender_icon.png 2 May, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆశయాల సాధనకే బీజేపీ ప్రయాణం

26-04-2025 12:00:00 AM

ఖమ్మం, ఏప్రిల్25.భారత దేశ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం కేవలం ఒక మనిషి బయోగ్రఫీ కాదు  అది ఒక ఉద్యమం అని, ఆయన ఆత్మవిశ్వాసం, విద్యాధికారం, సమానత్వం పట్ల నిబద్ధత ఈ దేశపు సామాజిక నిర్మాణాన్ని ఆధునిక దశ కు చేర్చిందనీ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు.

శుక్రవారం  ఖమ్మం పట్ట ణంలోని రత్న గార్డెన్స్లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను రాజకీయంగా కొనసాగి స్తూ, దళిత సమాజాన్ని ప్రధాన వర్గంగా గుర్తించాల్సిన సమయం వచ్చిందని బీజేపీ నాయకులు స్పష్టంగా ప్రకటించారు.

ఆయన చూపిన మార్గమే దేశ భవిష్యత్కి మార్గదర్శి అని, బీజేపీ పార్టీ సైతం అదే ధ్యేయంతో నడుస్తోందని వారు అబిప్రాయపడ్డారు.తా ము ఆయనను ఓ ఓటు బ్యాంకుగా కాదు, ఓ మార్గదర్శిగా చూస్తాం, అని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సుదర్శన్ , ఖమ్మం జిల్లా పార్లమెంట్ కన్వీనర్ నం బూరి రామలిేంశ్వరరావు , నున్న రవికుమా ర్ ,ఆల్లిక అంజయ్య , రవి రాథోడ్ ,వీజా రెడ్డి , సుబ్బారావు, గుప్తా , బెనర్జీ , రేగన్ ప్రతాప్, వేరెల్లి రాజేష్, కందుల శ్రీకాంత్, ఉష , సరస్వతి ,ఏలూరు నాగేశ్వరావు , బిజెపి రాష్ట్ర జిల్లా దళిత సామాజిక వర్గ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.