21-06-2025 09:04:24 AM
హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పింది నేనే అన్నారు. రాజన్న సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రభాకర్ రావు చాలా మంది జీవితాలు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు, వారి భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు.ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. పెద్దాయన చెబితేనే ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) చేశామని ఇప్పటికే రాధాకిషన్ చెప్పారు.. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao), కేటీఆర్ కు ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కు కారణం కేసీఆర్, కేటీఆర్ అన్నారు.
సీఎంవో అడ్డాగా చేసుకుని ప్రభాకర్ రావు(Prabhakar Rao) ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. పేపర్ లీక్ కేసులో ప్రభాకర్ రావు ఆదేశాలతో నన్ను అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ అధికారి.. ప్రభాకర్ రావు మాట్లాడినట్లు నా ముందే చెప్పారని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో ఫేస్ టైం, సిగ్నల్ యాప్ లోనే ఫోన్ మాట్లాడుకున్నామని తెలిపారు. ప్రభాకర్ రావు భారత్ కు వచ్చే ముందు కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) అమెరికా ఎందుకువెళ్లారు? అని ప్రశ్నించారు. తనకు సిట్(Special Investigation Team) అధికారుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పిన బండి సంజయ్ సిట్ అధికారులు వచ్చి విచారిస్తామన్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావును కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నాలు చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.