14 April, 2026 | 5:14 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

సుల్తానాబాద్ లో ముగిసిన బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు..

16-10-2025 05:12 PM

విజేతలకు బహుమతులు ప్రధానం..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, మై భారత్ పెద్దపల్లి జిల్లా స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం గురువారం బ్లాక్ స్థాయి క్రీడాపోటీలు జరిగాయి. రెండు రోజుల పాటు జరిగే పోటీలను సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ ముఖ్యఅతిధిగా హజరై ప్రారంభించారు. ముగింపు కార్యక్రమంలో పెద్దపల్లి వాలీబాల్ అసోసియేషన్ సెక్రెటరీ ముత్యాల రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ భారత్ క్రీడా పోటీలను వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

విద్యార్థులు సెల్ఫోన్ కు దూరంగా ఉండి శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండేందుకు ఏదో ఒక క్రీడను అలవర్చుకోవాలన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలురకు వాలీబాల్, కబడ్డీ, షటిల్ బాడ్మింటన్, చెస్, 400 మీటర్ల రన్నింగ్, షాట్పుట్ పోటీలు నిర్వహించారు. క్రీడల్లో పాల్గోన్న క్రీడాకారులను గెలుపొందిన యువకులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మై భారత్ పెద్దపల్లి ఇంచార్జి మహేశ్, స్పోర్ట్స్ క్లబ్ సెక్రటరీ తిరుపతి వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గోన్నారు.