16-10-2025 05:17:33 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లపై అధికార కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ చిత్తశుద్ధి లేకపోవడం వలన బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. గురువారం నిర్మల్ లో జిల్లా పార్టీ సమావేశం నిర్వహించి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి బీసీలకు 42 శాతం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. ఈనెల 18 నిర్వహించి బీసీల బందుకు పార్టీ సహకరిస్తుందని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీని గ్రామస్థాయిలో విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సయ్యద్ హైదర్ కార్యకర్తలు ఉన్నారు.