calender_icon.png 29 October, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యున్నత సేవే రక్తదానం చేయడం

29-10-2025 01:58:48 PM

ఎస్పీ కాంతిలాల్ పాటిల్

పోలీస్ అమరవీరుల సంస్మరణలో రక్తదాన శిబిరం

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కాంతిలాల్ లాల్ పాటిల్  ఎఎస్పి చిత్తరంజన్ తో కలసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ రక్తదానం మనిషి చేయగలిగే అత్యున్నత మానవతా సేవ అని, ఈ దానం మరొకరి ప్రాణానికి ప్రాణాధారమవుతుందని తెలిపారు. పోలీసు ఉద్యోగం అంటే కేవలం చట్ట పరిరక్షణ మాత్రమే కాకుండా, ప్రజల జీవన రక్షణ కూడా అని అన్నారు.

అమరవీరుల జ్ఞాపకార్థం నిర్వహించే సేవా కార్యక్రమాలు వారికి అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.రక్తదానానికి ముందుకొచ్చిన 103 మంది స్థానిక యువతకు, పోలీస్ అధికారులు, సిబ్బంది, స్పెషల్ పార్టీ సభ్యులకు ఎస్పీ  అభినందనలు తెలిపారు. వారి సేవాభావం సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.రేపు (అక్టోబర్ 30) అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఎస్పీ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డిఎస్పీ వాహిదుద్దీన్, సిఐలు, ఆర్ఐలు, ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, పోలీస్ స్టేషన్ సిబ్బంది, హోం గార్డులు,  యువత  పాల్గొన్నారు.