17 May, 2026 | 12:03 PM

హెచ్‌ఆర్‌సీపై నీలినీడలు

26-08-2024 08:01 AM
  1. మానవ హక్కులను కాపాడేదెవరు?
  2. చైర్మన్, సభ్యుల నియామకమెప్పుడు?
  3. ఏడాదిగా ఒక్క కేసును పరిష్కరించలె
  4. కమిషన్ నియామకంపై కాలయాపన
  5. నోటిఫికేషన్లతో సరిపెట్టిన ప్రభుత్వాలు

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ).. మానవ హక్కుల పరిరక్షణే కోసం తీసుకొచ్చిన చట్టబద్ధ స్వతంత్ర సంస్థ. రాష్ట్రంలో ఎక్కడ ఎన్‌కౌంటర్లు, దళిత, గిరిజనులు, మహిళల మీద దాడులు జరిగినా గుర్తుకొచ్చేది హెచ్‌ఆర్‌సీ. అలాంటి సంస్థకు 20 నెల లుగా చైర్మన్, సభ్యులు లేకపోవడంతో ప్రస్తు తం గందరోగళంగా మారింది. 2023, 2024లో ఇప్పటివరకు ఒక్క కేసును కూడా పరిష్కరించలేదు. కమిషన్ చైర్మన్ సహా సభ్యులందరూ ఒకేసారి రిటైర్మెంట్ కావడం తో కేసులను విచారించే వారు లేక కేసులు పెరిగిపోతున్నాయి.

కమిషన్‌లోని చైర్మన్, సభ్యులు పదవీ విరమణ చేస్తే మూడు నెలల్లోగా కొత్తవారిని నియమించాలని సుప్రీం కోర్టు మార్గనిర్దేశకాలు చెబుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాల (బీఆర్‌ఎస్, కాంగ్రెస్) కాలయాపన కారణంగా 20 నెలలుగా చైర్మన్, సభ్యుల నియామకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫిర్యాదులు పరిష్కారం కాకపోవ డంతో ఫిర్యాదుదారులు వాటిని వెనక్కి తీసుకుంటున్నారు.అలాగే పరిష్కారం కోసం ఇతర మార్గాలను ఆశ్రయిస్తుండడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు.  

ఒకేసారి నియామకం,పదవీ విరమణ

హెచ్‌ఆర్‌సీలో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యు లు ఉంటారు. ఇద్దరు సభ్యుల్లో ఒకరిని జ్యుడీషియల్, ఇంకొకరిని నాన్ జ్యుడీషియల్ కేట గిరీలో  నియమిస్తారు. 2019లో తొలిసారి తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. చైర్మన్‌గా జస్టిస్ చంద్ర య్య, సభ్యులుగా నడిపల్లి ఆనందరావు(జ్యుడీషియల్), ఇర్ఫాన్ మోహినుద్దీన్(నాన్ జ్యుడీషియల్)ను నియమించారు. వీరు ముగ్గురు ఒకేసారి నియామకం అయ్యారు. ఒకేసారి 2022 డిసెంబర్‌లో పదవీ విరమ ణ చేశారు. అప్పటి నుంచి కమిషన్‌లో ఒక్క రూ కూడా లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇన్‌ఛార్జ్ బాధ్యతలను కూడా ఎవరికీ అప్పగించలేదు.హెచ్‌ఆర్‌సీకి కేసులు వస్తున్నా విచారించడానికి ఎవరూ లేరు.

మొదటి నుంచి నిర్లక్ష్యమే..

హెచ్‌ఆర్‌సీ ఏర్పాటుపై ప్రభుత్వాలు మొదటి నుంచి నిర్లక్ష ధోరణినే ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రా ల కమిషన్లు కూడా హైదరాబాద్ కేంద్రంగానే పనిచేశాయి. 2019లో జగన్ సీఎం అయ్యాక.. ఏపీ కమిషన్‌ను కర్నూలుకు తరలించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ హెచ్‌ఆర్‌సీపై నిర్లక్ష ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. 

ఆలస్యం వెనుక రాజకీయ కారణాలు

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా కమిషన్ నియా మకం అలస్యమవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో బీఆర్‌ఎస్ కాని, ఇప్పుడు కాంగ్రెస్ కాని తమకు అనుకూలంగా ఉన్న వారిని నియమించుకునే ప్రయత్నాలు చేయడంతో అందుకు కొందరు ఒప్పుకోలేదని తెలుస్తోం ది. దీంతో అప్పుడు, ఇప్పుడు కొత్త  కమిషన్‌ను నియమించే విషయంలో తాత్సారం చేస్తున్నట్లు సమాచారం.

రెండుసార్లు నోటిఫికేషన్..

2022 డిసెంబర్‌లో చైర్మన్ సహా ఇద్దరు సభ్యులు పదవీ విరమణ చేసిన తర్వాత నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయి తే దానికి అనేకమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో దరఖాస్తుల స్క్రూ ట్నీ చేయడం ఆలస్యమైంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చి  కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కమిషన్ ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కారు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గతంలో చేసు కున్న దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినట్లు న్యాయవాదులు అంటున్నారు. దీంతో అనేకమంది దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్క్రూట్నీ పేరుతో కాలయాపన చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హ్యూమన్ రైట్స్‌కు మంత్రి పదవి ఉంటే బాధ్యత పెరుగుతుంది

అంతర్జాతీయంగా మానవ హక్కులకు చాలా ప్రాధాన్యత ఉన్నది. చాలా దేశాల్లో హ్యూమన్ రైట్స్‌కు ప్రత్యేక మినిస్ట్రీ ఉంది. ఆఖరికి పాకిస్థాన్‌లో కూడా హెచ్‌ఆర్ మంత్రి ఉన్నారు. మానవ హక్కులకు ప్రత్యేక మంత్రి ఉంటే బాధ్యత పెరుగుతుంది. కమినిషన్ల నిర్వహణపై ఫోకస్ ఉంటుంది. 1993 నుంచి హెచ్‌ఆర్సీపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి.  ఇప్పటికైనా ప్రభుత్వాలు హెచ్‌ఆర్సీ చైర్మన్‌ను, సభ్యులను నియమించాలి.

 పందెం దామోదర్ రెడ్డి, 

సీనియర్ న్యాయవాది