17 May, 2026 | 10:50 AM

65 ఉద్యోగ సంఘాలతో జేఏసీ ఏర్పాటు

26-08-2024 08:06 AM

చైర్మన్‌గా లచ్చిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 65 ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటు అయ్యింది. జేఏసీ చైర్మన్‌గా రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ వీ లచ్చిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ లో ఆదివారం తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యా య, కార్మిక, సీపీఎస్, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. వీ లచ్చిరెడ్డి అధ్యక్షతన జరి గిన ఈ సమావేశంలో ఆర్టీసీ, విద్య, న్యాయ, విద్యుత్, మెడికల్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ, జలమండలి, మున్సిపల్, వ్యవసాయ, సీపీఎస్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, పీసీబీ తదితర ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగులంతా ఒకవైపు, ఉద్యోగ సంఘాల నాయకులంతా మరో వైపు ఉన్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులకు కనీసం హెల్త్ పాలసీ కూడా సక్రమంగా చేయలేకపోయారన్నారు. సంఘాల నుంచి వారస త్వం గా వచ్చారే కానీ, సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని శాఖలు అస్తవ్యస్తమైనా ఒక్క జేఏసీ నాయకుడు మాట్లాడ లేదన్నారు.

ప్రస్తుత ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండటం వల్లనే ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు. తాము ఎవరికీ ప్రత్యామ్నా యం కాదని, ఉద్యోగులకు మేలు జరిగేలా చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాననిన ఆయన హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ సం ఘం నాయకుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు. సీసీఎస్‌ను అంగీకరించింది గత ప్రభుత్వమే అన్నారు. సెప్టెంబ రులో సీపీఎస్ రద్దు కాబోతున్నదని జోస్యం చెప్పారు. ఆర్టీసీ యూనియన్ నాయకుడు అశ్వద్ధామరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కి వేసిందన్నారు. 

ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంఘం సెక్రటరీ జనరల్ మేడి రమేష్ మాట్లాడు తూ.. గత ప్రభుత్వంలో అప్రజాస్వామిక విధానాలు ఎన్నో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు కత్తి జనార్ధన్, దేవిక రొక్కం, సాయిరెడ్డి, కుమారస్వామి, మహిపాల్‌రెడ్డి, ఉపేందర్‌రావు, షౌకత్ అలీ, గోపాల్‌రెడ్డి, ఫుల్‌సింగ్ చౌహాన్, కే రామకృష్ణ, ఎస్ రాములు, నిర్మల, కమలాకర్ పాల్గొన్నారు.