calender_icon.png 12 August, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏయిమ్స్‌కు శరీర దానం

12-08-2025 01:16:18 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): పీర్జాదిగూడకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ భూపతి ధనుంజయ్ (77) అనారోగ్యంతో సోమవారం మృతిచెందారు. ఆయన కుమారుడు సృజన్, కుమార్తె సమాజ హితం కోరి వైద్య విద్య నిమిత్తం మెడికల్ కాలేజీకి తమ తండ్రి శరీరాన్ని దానం చేసేందుకు ముందుకొచ్చారు.

‘తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసి యేషన్ వరంగల్  ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాన్ని ఏయిమ్స్ బీబీనగర్ అనాటమీ విభాగానికి అప్పగించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ మృ దుల, అనాటమ విభాగాధిపతి డాక్టర్ రోహిణి, అనాటమీ ప్రొఫెసర్లు ధనుంజయ్ కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రకుమార్, నేత్ర, అవయవ శరీర దాతల అసోసియేషన్ హైదరాబాద్ ట్రెజరరీ విజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు.