12-08-2025 01:14:34 AM
మేయర్ గద్వాల విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని బస్తీల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అధి కారులు, సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఉదయం మేయర్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి జూబ్లీహిల్స్ సర్కిల్లోని అంబేద్కర్ నగర్, ఉదయ్ నగర్ బస్తీల్లో పర్యటించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బందికి మేయర్ ఆదే శాలు జారీ చేశారు .
అంబేద్కర్ నగర్లో నాలా వద్ద కొంత భాగం కూలిన రక్షణ వాల్ వద్ద ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా తక్షణ ప్రత్యామ్నాయ రక్షణ చర్యలు చేపట్టాలని మేయర్ చెప్పారు. బంజారాహిల్స్ రోడ్డు నం.1 లో ఇటీవలే రోడ్డు పైన స్లాబ్ కుంగిపోయిన ప్రదేశాన్ని మేయర్ పరిశీలించారు. రూ.65 లక్షలతో 19 మీటర్ల మేర ఆర్ సీసీ స్లాబ్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినం దుకు వెంటనే పనులు ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఆమెవెంట చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ఉన్నారు.