calender_icon.png 12 August, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముమ్మరంగా రోడ్డు సేఫ్టీ డ్రైవ్

12-08-2025 01:17:00 AM

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో వర్షాకాలం కారణంగా రోడ్లపై ఏర్పడిన గుంతలు, క్యాచ్‌పీట్స్, సెంట్రల్ మీడియన్ల మరమ్మతు పనులు జీహెచ్‌ఎంసీ ముమ్మరంగా చేపట్టింది. సోమవారం నిర్వహించిన రోడ్ సేఫ్టీ డ్రైవ్‌లో వివిధ జోన్లలో మొత్తం 247 బీటీ/సీసీ రోడ్డు గుంతలు పూడ్చడం, 11 క్యాచ్‌పీట్స్ మరమ్మతు చేయడం, 7 క్యాచ్‌పీట కవర్ రీప్లేస్మెంట్ పనులు పూర్తయ్యాయి.

కాగా, ఇప్పటివరకు మొత్తం 11,741 గుంతలు గుర్తించగా, వాటిలో 8,583 గుంతలు పూడ్చబడ్డాయి. ఈ మేరకు ఇప్పటివరకు 8,830 గుంతల మరమ్మతు పూర్తయింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ మాట్లాడుతూ, వర్షాకాలంలో రోడ్లపై గుంతలు, క్యాచ్పిట్స్ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బం ది వేగవంతంగా పనులు చేస్తున్నారని చెప్పారు