26-07-2025 12:00:00 AM
సిరికొండ జులై, 25(విజయ క్రాంతి): చెట్లపోదల్లో యువకుని మృతదేహం లభించిన సంఘటన సిరికొండ మండలం మైలారం గ్రామంలో చోటుచేసుకుంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన అయిల కుంట ప్రాంతంలో చెట్ల పొదల్లో గుర్తుతెలియని యువకుని మృతదేహం పడి ఉన్నట్టు సిరికొండ పోలీస్ లకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అయిల కుంట ప్రక్కన ఉన్న అనుమానాస్పదంగా దాదాపు35,నుండి 40 సంవత్సరాలు కలిగిన యువకుని మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కు తరలించ్చినట్లు, ఫైనల్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిరికొండ, యస్ ఐ, రామకృష్ణ తెలిపారు. గ్రామస్తుల అందించిన వివరాల ప్రకారం ఎక్కడో చంపి బైకుపై మధ్యలో కూర్చుండపెట్టుకుని వెనకాల కూర్చున్న వ్యక్తి మృతి చెందిన వ్యక్తిని పట్టుకుని బైక్ పై తరలిస్తున్న దృశ్యలు మైలారం గ్రామం లో ఏర్పాటు చేసిన సిసి పుటేజీలో స్పష్టంగా కనిపించి నట్లు గ్రామస్తులు తెలిపారు.