26-07-2025 12:00:00 AM
నారాయణపేట.జులై 25,(విజయక్రాంతి); నారాయణపేట కొడంగల్ ఎత్తిపో తల ప్రాజెక్ట్ క్రింద భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని భూ నిర్వాషితుల సంఘం జిల్లా గౌరవాద్యక్షులు జి వెంకట్రమరెడ్డి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ , కన్వీనర్ మచేందర్ డిమాండ్ చేసారు.
11వ రోజు దీక్షలలో కూర్చున్న రైతులను ఉద్దేసించి వారు మాట్లాడుతూ ప్రభుత్వం బలవంతంగా రైతులను భయ బ్రాంతులకు గురిచేస్తూ మీకు సంక్షేమ ప థకాలు ఇండ్లు,పెన్షన్ లు ,రేషన్ కార్డులు రద్దు చేస్తామని భయపెట్టడం సరైనపద్దతి కాదని విమర్షించారు.ప్రభుత్వం ఎకరం కు పద్నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు జిల్లాలో ఎక్కడైనా కొనుగోలు చేసి చూ యించాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో ఎకరం ధర 30లక్షల నుండి కోటి రూపాయాల వరకు ఉందన్నారు. ప్రభుత్వ బేసిక్ ధర రెండున్నర లక్షల నిర్ణయించడం కరెక్ట్ కాదన్నారు. భూముల ధర నిర్ణయించడం కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం రైతులతో చర్చించి న్యాయమైన పరిహారం ఇచ్చాక భూసేకరణ చేయడానికి పూనుకోవాలని అన్నారు. కార్యక్రమం లో,రైతుసంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ ధర్నాలో మాజీ వైస్ ఎంపీపీ మహేష్ కు మార్,ధర్మరాజు, నర్సిరెడ్డి,జ్ఞానేశ్వర్,మొగులప్ప,శ్రీనివాస్ రెడ్డి,చంద్రశేకర్, నర్సిములు,అశోక్, తదితరులుపాల్గొన్నారు.