11-11-2025 01:40:06 AM
స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె నుంచి రాబోతున్న ప్రతి సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొంటున్నాయి. ఈ అంచనాల మధ్య ఇప్పుడు ‘రివాల్వర్ రీటా’తో కీర్తి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దర్శకుడు జేకే చంద్రు దీన్ని లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్ పతాకంపై సుధన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి నిర్మిస్తున్నారు.
కీర్తి సురేశ్‌ను కొత్త అవతార్‌లో ఆవిష్కరించనున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. చాలా రోజుల క్రితమే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం వివిధ కారణాల వల్ల విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు మరో రిలీజ్ డేట్‌ను ఖాయం చేసుకుంది. ఈ సినిమాను నవంబర్ 28న థియేటర్ల ద్వారా విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాకు సియన్ రోల్డన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.