25-08-2025 10:11:15 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో సోమవారం మధ్యాహ్నం కొత్త రైలు కనువిందు చేసింది. న్యూఢిల్లీ నుండి ఖాళీ కొత్త భోగిలతో బెంగళూరు వెళ్తున్న ఈ కొత్త రైలు బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో లోకో పైలట్ల మార్పులో భాగంగా మూడవ లైన్ పై కొద్దిసేపు ఆగింది. కొత్త రైలు అందాన్ని చూస్తూ స్టేషన్ లోని ప్రయాణికులు మంత్రముగ్ధులయ్యారు. కొత్త అందాలని తనలో సింగారించుకున్న ఆ కొత్త రైలు స్టేషన్ నుండి వయ్యారంగా కదులుతున్న సమయంలో ప్రయాణికులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.